హయత్‎నగర్ SBI బ్యాంకులో అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు

హయత్‎నగర్ SBI బ్యాంకులో అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు

హైదరాబాద్: హయత్ నగర్‎లోని ఎస్‎బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బ్యాంక్ క్లోజ్ చేసి ఉండటంతో ప్రాణ నష్టం తప్పింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్కుట్ గల కారణాలను ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా లేక మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.