ప్రాజెక్ట్ ఆపేందుకు వంద‌లాది కేసులు

ప్రాజెక్ట్ ఆపేందుకు వంద‌లాది కేసులు

మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ఆపేందుకు వంద‌ల‌ది కేసులు వేశార‌న్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప‌నులు ఆపాలని ఓ దుర్మార్గుడు కోర్టుకు కూడా వెళ్లాడంటూ మండిప‌డ్డారు. మల్లన్నసాగర్‌ను అడ్డుకునేందుకు 600 పైచిలుకు కేసులు  వేశార‌ని చెప్పుకొచ్చారు. ఎన్ని కేసులు వేసిన ఇంజినీర్లు భ‌య‌ప‌డ‌లేద‌న్నారు. భ‌య‌ప‌డ‌కుండా ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేశార‌న్నారు. నీటి పారుద‌ల శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు మంత్రి హ‌రీశ్ రావును కూడా అనేక ఇబ్బందుల‌కు గురి చేశార‌న్నారు. ఆయ‌న‌ను కూడా బ‌ద్నాం చేసినార‌న్నారు. అయినా కూడా హ‌రీశ్ రావు ఎక్క‌డ త‌గ్గ‌కుండా ప్రాజెక్టు ప‌నులు ద‌గ్గ‌రుండి పూర్తి చేశార‌న్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్లామ‌న్నారు. హరీశ్‌రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 

చాలా నిబద్ధతో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ నిర్మించామ‌న్నారు కేసీఆర్. పూర్తి అవినీతి రహితంగా మల్లన్నసాగర్‌ నిర్మించుకున్నామ‌న్నారు. తెలంగాణ జల హృదయ సాగరం..మల్లన్నసాగర్ అన్నారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు అంటూ పేర్కొన్నారు. మ‌ల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమ‌న్నారు. మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతిఒక్కరికి ప్రణామాలు తెలిపారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 58వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కొందరు దుర్మార్గులు కాళేశ్వరాన్ని ఆపేందుకు స్టే తెచ్చారన్నారు. అవినీతి ర‌హితంగా వంద‌కు వంద శాతం ప్రాజెక్టును పూర్తి చేశామ‌న్నారు సీఎం.