
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. తారకరత్న మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక తారకరత్న పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు, అభిమానుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తీసుకురానున్నారు.