సీఎం కేసీఆర్‌‌ యువతను మద్యంలో ముంచుతున్నరు : అల్కా లాంబా

సీఎం కేసీఆర్‌‌  యువతను మద్యంలో ముంచుతున్నరు : అల్కా లాంబా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఖజానాను నింపేందుకు తెలంగాణ యువతను సీఎం కేసీఆర్‌‌ మద్యానికి బానిసలు చేస్తున్నారని సీడబ్ల్యూసీ సభ్యురాలు అల్కా లాంబా అన్నారు. రూ.36 వేల కోట్లకు పైగా మద్యాన్ని అమ్మి.. ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొన్ని వేల మంది వ్యాపారుల నుంచి లైసెన్స్​ ఫీజుల రూపంలో రూ.వేల కోట్లు ఆర్జించారన్నారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. యువతకు కావాల్సింది మద్యం కాదని, ఉద్యోగాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కేంద్రంగా కరోనా టైమ్‌లో లిక్కర్ స్కాం​జరిగిందని, కేసీఆర్ కూతురు కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ స్కాంలో ఉన్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌‌ఎస్ మధ్య ఒప్పందం జరిగినందు కవితను అరెస్ట్ చేయట్లేదని ఆరోపించారు. బీఆర్‌‌ఎస్‌ లీడర్లు జైలుకెళ్లడం ఖాయమన్నారు.