సారు రాలే.. రివ్యూ చేయలే..!

సారు రాలే.. రివ్యూ చేయలే..!
  • సారు రాలే.. రివ్యూ చేయలే..!
  • కదలని కామారెడ్డి జిల్లా  సాగు నీటి ప్రాజెక్టులు
  • నేటికీ తీరని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కల
  • సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీకి ఏడాది 

కామారెడ్డి , వెలుగు:  ‘కామారెడ్డి జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టు పనులకు సంబంధించి 15 రోజుల్లో రివ్యూ చేస్తా.. మరోసారి జిల్లాకు వస్తా.. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద గోల్ బంగ్లాలో కూర్చొని ఇరిగేషన్ ఆఫీసర్లు, జిల్లా ప్రతినిధులతో కలిసి మీటింగ్ పెడుతా.. పనుల్ని స్పీడప్ చేయిస్తా.. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తా.. ఇందుకు సంబంధించిన జీవో వెంటనే రిలీజ్ అవుతుంది..’ అని సీఎం కేసీఆర్ 2021 జూన్ 20న కామారెడ్డి కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభోత్స మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్న మాటలివి.. ఏడాదైనా ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై సీఎం రివ్యూ చేయలేదు. జిల్లాకు మరోసారి రాలేదు. కనీసం హైదారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టలేదు. ఇక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు.   

స్లోగా కాళేశ్వరం 22 ఫ్యాకేజీ పనులు

సాగు నీటి ప్రాజెక్టులు అంతగా లేని కామారెడ్డి జిల్లాలో బోర్లు, వర్షాధారంపై రైతులు పంటల్ని సాగు చేస్తున్నారు. బోర్ల కోసం రైతులు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అప్పులు చేసి బోర్లు తవ్వించి అప్పుల పాలవుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగు నీళ్లు అందించేందుకు 14 ఏళ్ల కింద అప్పటి కాంగ్రెస్ సర్కారు ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా 22వ ప్యాకేజీని చేపట్టింది. ఇప్పుడు దానిని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి రీడిజైన్ చేసి బాన్సువాడ ఏరియాలోని కొంత భాగాన్ని చేర్చి మొత్తం 2 .50 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించేలా ప్లాన్​చేశారు. అప్పటి సర్కారు హయంలో  పనులు షురూ చేశారు. మెయిన్ కెనాల్స్ కొంత భాగం తవ్వారు. సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద రిజర్వాయర్​ నిర్మాణం జరిగింది. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వకానికి ఇంకా 1,500 ఎకరాల భూ సేకరణ జరగాలి.   ఇందుకు రూ.500 కోట్ల వరకు ఫండ్స్ కావాలి. నిజామాబాద్ జిల్లా మంచిప్ప నుంచి 21వ ప్యాకేజీ నుంచి 22వ ప్యాకేజీకి నీళ్లు రావడానికి యాచారం వద్ద సొరంగ మార్గం తవ్వాల్సి ఉండగా సగం కంప్లీట్ అయ్యింది. మంచిప్ప దగ్గరి నుంచి జిల్లాకు నీళ్లు వచ్చేందుకు కావాల్సిన కెనాల్స్​ పనులు, సొరంగ మార్గం, రిజర్వాయర్ల పనులు, మెయిన్ కెనాల్స్ పనులు కంప్లీట్​ కావాల్సి ఉంది. 14 ఏళ్ల కింద ఇందుకు రూ.3,500 కోట్ల ఫండ్స్ అవసరమని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఎస్టిమేషన్ కూడా పెరిగింది. పలు మార్లు మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు త్వరలోనే సాగు నీళ్లు జిల్లాకు వస్తాయంటూ మాటలు చెబుతున్నారు. కానీ వారి మాటలకు తగ్గట్లుగా ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వర్క్స్ స్పీడప్ కావడం లేదు. 

కదలని ‘లెండి’.. ‘నాగమడుగు’

అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్ర, అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్లు  లెండి ప్రాజెక్టు పనులు చేపట్టాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్ సమీపంలో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో 25 వేల ఎకరాలకు సాగు నీళ్లు వస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. పనుల్లో కదలిక వస్తుందని భావించినా ఇప్పటికీ మళ్లీ దాని ఊసేలేదు. నిజాంసాగర్ మండలంలో చేపట్టే నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్ ద్వారా పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్, పెద్దకొడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గల్ ద్వారా సాగు నీళ్లు అందుతాయి. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గవర్నమెంట్ రూ.450 కోట్లతో ఆమోదం తెలిపినప్పటికీ ఇంకా పనులు షురూ చేయలేదు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ఎత్తు పెంపు కూడా జరగలేదు.