ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే.. కాంగ్రెస్ పార్టీ: కేసీఆర్

ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే.. కాంగ్రెస్ పార్టీ: కేసీఆర్

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ లో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీని, అభ్యర్థులను చూసి ప్రజలు ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికాంలోకి వస్తే తెలంగాణకు భయంకరమైన పరిస్థితులు వస్తాయని కేసీఆర్ అన్నారు. 

also read :- సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్కు షాక్.. గాలి అనిల్ కుమార్ రాజీనామా
 

58 ఏండ్లు తెలంగాణ ప్రజలు గోసపడ్డారని.. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. నిజాంసాగర్ ను కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు.. కానీ ప్రస్తుతం నిజాంసాగర్ ఏడాదంతా నిండుగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు. 

దేశంలో ఎక్కడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదని.. కొత్త బీడీ కార్యికులకు కూడా పెన్షన్ ఇస్తామని కేసీఆర్ చెప్పారు. రాబోయో రోజుల్లో పెన్షన్ రూ. 5 వేలు చేస్తామన్నారు.