సంతోష్ ఎక్కడ? ఐదారు నెలలుగా కనిపించని, వినిపించని ఎంపీ

సంతోష్ ఎక్కడ? ఐదారు నెలలుగా కనిపించని, వినిపించని ఎంపీ

కింగ్ పిన్ గా వ్యవహరించే సంతోష్ ఎన్నికల వేళ ఎటుపోయారు? టికెట్ల కేటాయింపు నుంచి గెలుపుదాకా సమన్వయం చేస్తున్నదెవరు? ఐదు నెలలుగా కనిపించని, వినిపించని రాజ్యసభ సభ్యుడు ఆగస్టు 21న బీఆర్ఎస్ జాబితా విడుదల రోజూ సీఎం వెంట లేరు సంతోష్ లేకుండా రోజూ 3,4 సభలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి

కీలకమైన ఎన్నికల తరుణంలో కేసీఆర్ వెన్నంటి ఉండాల్సిన ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఎంపీ జోగినపల్లి సంతోష్ ఎటుపోయారు.? టికెట్ల కేటాయింపు నుంచి గెలుపు వరకు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నది అంతు చిక్కడం లేదు. ఐదు నెలలుగా అటు ప్రగతి భవన్ లో... ఇటు సీఎం కేసీఆర్ వెంట కనిపించడం లేదు, ఆయన గొంతు వినిపించడం లేదు. 

కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ రాజ్యసభ ఎంపీగా ఎదిగిన సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ తో పాపులర్ అయ్యారు. మూడు మొక్కలతో మొదలైన ఆయన గ్రీన్ ఇండియా చాలెంజ్ కొండగట్టు పరిసరాల్లో వెయ్యి ఎకరాల్లో ప్లాంటేషన్ దాకా సాగింది. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఢిల్లీ వెళ్లిన ప్పుడు తన బాగోగులు చూసేందుకు సంతోష్ కావాలనే పట్టుదలతో కేసీఆర్ ఆయనను రా జ్యసభకు పంపారు. ఇదే క్రమంలో ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టార్ట్ చేసి పాపులారీ సంపాదించుకున్నారు. 

ఐదారు నెలలుగా కనిపిస్తలే...

కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినప ల్లి సంతోష్ కుమార్.. కేసీఆర్ తోడల్లుడు రవీందర్, శశికళ దంపతుల కుమారుడు. చాలా కాలంగా సీఎం కేసీఆర్ కు వెన్నంటి ఉంటూ నీడలా కాపాడుతున్నారు సంతోష్ కుమార్. ఒక్కటేమిటి టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికలు పూర్తయ్యేదాకా అంతా ఆయన కనుసన్నల్లోనే సాగేది. అన్నీతానై ముందు నిలిచిన సంతోష్ కుమార్ ఐదారు నెలుగా సీఎం కేసీఆర్ వెంటగానీ, అటు ప్రగతి భవన్ లో కానీ కనిపించడం లేదు. 

ఆగస్టు 21న తెలంగాణ భవన్ కు వచ్చి 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కేసీఆర్. ఆ రోజు కూడా పక్కన మంత్రి హరీశ్ రావు ఉన్నారు. కానీ వెనకాల సంతోష్ కనిపించలేదు. కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయల్దే రిన దగ్గరి నుంచి తిరిగి చేరుకొనే వరకు వెంటే ఉండేవారు. సభలకు వెళ్లినప్పుడు కావాల్సిన మెటీరియల్ పట్టుకొని వెనకాలే నిల్చుడేవారు. 

అలాంటి సంతోష్ కుమార్ లేకుండా సీఎం రోజుకు మూడు నాలుగు సభలకు హాజరవుతుండటం గమనార్హం. ఇంతకూ సంతోష్ ఎక్కడికి వెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు..? ఆ బాధ్యతలు ఎవరు చూస్తు న్నారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.