వెటర్నరీ డాక్టర్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందన

వెటర్నరీ డాక్టర్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందన

షాద్ నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన అమానుష ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. మానవ మృగాలు మన మద్యనే తిరుగుతున్నాయని, ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె తర్వాత విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల భద్రత గురించి మాట్లాడుతూ వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన దారుణం అమానుషమైన దుర్ఘటన అన్నారు. ఇంకా మన మధ్య మానవ మృగాలు తిరుగుతున్నాయన్నారు. మహిళా ఉద్యోగుల రక్షణ కోసం మనం బాధ్యత తీసుకోవాలన్నారు. వాళ్లను మన బిడ్డల్లా చూసుకోవాలని, సాయంత్రం 7 గంటల తర్వాత వాళ్లకు డ్యూటీలు వేయొద్దని సూచించారు కేసీఆర్. రాత్రి 8 గంటల్లోపు వాళ్లు ఇంటికి చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, చైల్డ్ కేర్ సెలవులు ఇస్తామని చెప్పారు. ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు

కాగా, షాద్ నగర్ ఘటనపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సీఎంవో తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారని పేర్కొంది.

MORE NEWS:

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు

మందు తాగించి : షాద్ నగర్ డాక్టర్ హత్యలో నమ్మలేని నిజాలు

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు