ఖమ్మం జైల్లో పెడ్తే కాపాడి కడుపున పెట్టుకున్రు: కేసీఆర్

ఖమ్మం  జైల్లో పెడ్తే  కాపాడి కడుపున పెట్టుకున్రు: కేసీఆర్

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఉద్యమ రోజులను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైల్లో పెట్టారని అన్నారు. అప్పుడు స్థానిక ప్రజలు ఎంతో పోరాటం చేసి తనను కాపాడుకున్నారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, అందరి ఐక్య పోరాటంతోనే తెలంగాణ సిద్ధించిందని స్పష్టం చేశారు.  

ఈ సందర్భంగా సీఎం జిల్లాకు పలు వరాలు కురిపించారు. సీఎం హామీలు ఇస్తుండగా జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం.. ‘‘ఇక్కడ కొత్త రకంగా అరుస్తున్నారు. సర్కస్ లెక్క. ఇదేం అరుసుడు ’’ అని కామెంట్ చేశారు. కాగా జిల్లాలోని 481 గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు 40 కోట్లు.. మణగూరు, ఇల్లందుకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మైనింగ్ ఇన్సిటిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజీగా మారుస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను మంజూరు చేస్తామని చెప్పారు.