బీజేపీ, కాంగ్రెస్ సంగతి చూసేది ప్రాంతీయ పార్టీలే: కేసీఆర్

బీజేపీ, కాంగ్రెస్ సంగతి చూసేది ప్రాంతీయ పార్టీలే:  కేసీఆర్

కేంద్రంలో అధికారంలోకి రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమేనని సీఎం కేసీఆర్ ​ధీమా వ్యక్తం చేశారు. కాం గ్రెస్​, బీజేపీ దుకాణాలు బంద్​ అవుతాయని, వాటి భరతం పట్టడం ఖాయమని  అన్నారు. బంగారు భారత్​ దిశగా ముందుకు సాగుతామన్నారు. ఆదివారం వనపర్తి, మహబూబ్ నగర్​లో ఏర్పాటు చేసిన టీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

‘‘నరేంద్ర మోడీ ఈడ పాలమూరుకొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. చెప్పుకుంటె ఇజ్జత్​ పోతది. ఆయన  సభల మా సభల ఉన్న దాంట్ల పావు మంది జనం కూడా లేకుండ్రి. దానికే ఆయన ఏం మాట్లాడుతరండి . ఏం లొల్లి అది. అట్ల మాట్లాడొచ్చునా? గ్రామ పంచాయతీ సర్పం చ్ కూడా మాట్లాడరట్ల. ఐదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు.. మీరేం చేసిండ్రో చెప్పచ్చును కదా దేశానికి. ఆయన ఏం చేసింది ఏం చెప్పడు. ఇనుపడబ్బాల గులకరాళ్లేసి ఊపినట్లు గలగలా బొలబొల లొల్లి లొల్లి గోల గోల. నేను అడుగతా ఉన్న.. ఏం చేసిండ్రు ఈ దేశానికి మీరు? మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేను చాలా చోట్లకు పోయిన.  నేనెవల్ని తిట్టలె. ఒకటో రెండో మాటలన్నం తప్ప నేనెవల్ని తిట్టలె. మనం ఏం చేసినమో చెప్పాలె. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధాన మంత్రి మల్ల ఎలక్షన్లక పోతే ఏం చేస్తమో చెప్పాలె. మేం గదే చెప్పి నం.. జనం గెలిపించుండ్రు. కాంగ్రెస్​, బీ జేపీ పెద్దపెద్ద మాటలు చెప్తున్నరు. వాళ్లను అడుగుతా ఉన్న..ఎందుకు పెట్టలే ఈ దేశంల రైతు బంధు స్కీం , రైతుభీమా స్కీం ? రైతులు సచ్చిపోతే పెదవులు సప్పరించుడు.. పీనుగల మీద దండలు వేసుడే మీ పనా?

వణికి సస్తా ఉన్నరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఏమంటడు.. ఎన్నికల తర్వాత నా భరతం పడుతరట. ఏంది గోశా..? ఏందిబై.. మేమెట్ల కనబడుతున్నం. నా ఆస్తుల లెక్కలు ఎవ్రీ ఇయర్​ ఇన్ కం ట్యాక్స్​కు సబ్ మిట్ చేస్తా ఉన్న. లెక్కలన్నీ పక్కాగా ఉన్నయి. మీరు ఊకుండే బాపతు గాళ్లేనా ?మే 23 తర్వాత ఈ దేశంలో పరిపాలనా పగ్గాలు చేప-ట్టేది ప్రాం తీయ పార్టీల కూటములే. మీ భరతం మేం పడుతం లక్ష్మణ్. మా భరతం కాదు. మరిచిపో.. మీ కత అయిపోయింది. రేపు కచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమే పరిపాలించబోతున్నది. మీరు (ప్రజలు)16సీట్లలో టీఆర్​ఎస్​ను గెలిపిస్తే  బంగారు భారతం కోసం నా రక్తం ధారపోస్త. ఈ మధ్య నేను ఫెడరల్ ఫ్రంట్ స్థాపిస్తానని చెప్పి న. దీం తో ఈ కేసీఆర్ ​గాడు ఢిల్లీకి గిన్క బయలుదేరుతడా ఏమోనని భయపడుతా ఉన్నరు. వాళ్ల  పీఠాలు కదులతా ఉన్నయి. గజ్జున వణికి సస్తున్నరు. ఈ కేసీఆర్​గాడు ఢిల్లీల దుకాణం పెడితే.. గోల్ మాల్ అయిపోతమని భయపడుతా ఉన్నరు. సిన్మాల చివరిసీన్ల విలన్లను తరిమినట్టు జనం తరుముతరేమోనని  వణుకుతున్నరు. రాష్ట్రంలో మోడీ బాగా అభివృద్ధి చేస్తా అంటే మేం అడ్డం పడ్డమని అంటున్నరు. 2014లో ఎన్నికలప్పుడు పాలమూరుకు మోడీ వచ్చిండు. తాను అధికారంలకొస్తే పాలమూరు పథకం పూర్తి చేస్త అన్నడు. మరి ఇన్నాళ్లు మీరు(మోడీ)అధికారంల  ఉన్నరు కదా.. ఆ పథకం ఏమైంది మరి?మోడీ.. ఈడికి వచ్చి తెలంగాణ గురించి నేర్చుకొని పో. నువ్వు నఖలు కొట్టినవు కదా రైతు బంధును. రైతులకు మేమిచ్చేదెంత? నువ్విచ్చే దెంత?

వ్యక్తి గతంగా మాట్లా డుతరా?

ఏమన్నంటే వ్యక్తుల మీద దాడి . కేసీఆర్​ నీ ముక్కు పెద్దగున్నది. గిదా.. కేసీఆర్​ ముక్కు పెద్దగుంటేంది?వ్యక్తుల మీద మాట్లాడుడేంది? నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి స్థా యి వ్యక్తి మాట్లాడవచ్చునా?!  కేసీఆర్​ నీకు జ్యోతిషం మీద నమ్మకమున్నది అంటరు. ఉంటే ఉన్నది లేకుంటే నీకేంది? రామజన్మభూమి సంగతేంది.. ఫలానా జన్మ భూమి సంగతేంది.. గిదా మాట్లాడేది? గివ్వా మాట్లాడేది?!  రైతుల సంగతి, ప్రజల సంగతి మాట్లాడాలె.  దేశ అభివృద్ధి గురించి మాట్లాడాలె. నేను చేసిన యాగాలు ఎవరైనా చేసిండ్రా ఇండియాలా? మేము నిజమైన హిందువులం.  వాళ్లు(బీజేపీ నేతలు) రాజకీయ హిందువులు. కాం గ్రెస్​, బీజేపోళ్లకు  పేదరికం పోడగొట్టే తెలివుండదు. దద్దమ్మలు, మొద్దన్నలు చేతకాని సన్నాసులు పాలిస్తున్నరు కాబట్టి దేశం ఇట్ల ఉన్నది. దేశంలో అన్నీ ఉన్నయి కానీ..లాభం ఏంది? ఈ దరిద్రుల పరిపాలన ఉంది. ఈ దరిద్రం పోవాలె. ఎవడో ఒకడు నడుము కట్టకపోతే ..ఈ దేశం బాగుపడదు. జాతీయ స్థాయిలో మార్పులురావాలె. మీరు దీవించి పంపిస్తే దేశంలో రా జకీయ ప్రకంపనాలు సృష్టిస్తా.  16 ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తవ్  కేసీఆర్​ అంటున్నరు? ఇదే పాలమూరు ఎంపీగా ఉండి దెబ్బకొట్టి తెలంగాణ తెచ్చినం. కొట్టుడు కొడితే దేశ రాజకీయ గమనమే మారిపోవాలె. ఢిల్లీ నుంచి ‌నాకు ఒక వార్త వచ్చింది. బీజేపీకి 150 సీట్లు దాటవట.కాంగ్రెస్​కు 100 సీట్లు దాటవట. రెండు దుకాణాలు బందే. దేశ పాలన వందకు వంద శాతం ప్రాం తీయపార్టీల చేతులకు రాబోతా ఉంది. ప్రజలు ఆగం ఆగం కావొద్దు. ఎలక్షన్లు రాం గనె గాలిగాలి గత్తరగత్తర లొల్లి లొల్లి . అన్ని పార్టీలు వస్తయి. ఆలోచించి ఓటెయ్యాలి .’’

ఈ మొగోడే పోయి కొట్టినట్టు

బీజేపోళ్లు ఒక బీసీలకు చేసిండ్రా, ఎస్సీలకు చేసిండ్రా? రైతుల కోసం చేసిండ్రా? మహిళలకోసం చేసిండ్రా?! ఓ ఇగ నేనే పాకిస్థాన్ల  పోయికొట్టినా . ఈ మొగోడే పోయి కొట్టినట్టు!! ఈ సర్జికల్ స్ట్రయిక్​ అనేది కేంద్రంల నేను మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగినయి. దాన్ని బయట మాట్లడరు. ఓ ఇగ ప్రపంచంల ఎవడు చెయ్యనట్లు .. నేనే ఆప్ సిఫాయిని అని నరేంద్రమోడీ అంటడు.. దాని కిబీజేపీ నాయకులు డబ్బ కొడుతరు. నేను దేశ ప్రజలకు క్షమాపణ  చెప్పాల్నని  లక్ష్మణ్ అంటున్నడు.  నేనట సైన్యం పరువు దీసిన్నట. ఆయినేమో నిలబెట్టిండట. సర్జికల్ స్ట్రయిక్​ను రాజకీయాలకు వాడుకుంటరా? ఈ ఎన్నికల్ల బీజేపీకి రాష్ట్రంల 14 సీట్లలో డిపాజిట్లు కూడా రావు.

దేశం నేర్చుకునేలా రెవెన్యూ చట్టం

జూన్ లో కొత్త రెవెన్యూ యాక్ట్​ తెస్తం. ధరణి అనే కొత్త వెబ్ సైట్ తెస్తం. గంట గంటకు అప్డేట్ అవుతది. ఇండియానే నేర్చుకునే రెవెన్యూ యాక్ట్​ తెస్తం. పాస్​బుకుల్లో  37 కాలమ్ లు ఉంటుండె. ఇవాళ 3 కాలమ్ లే పెట్టినం. పట్టాదారు కాలమ్ ఉంటది. అనుభవదారు కాలమ్ ఎందుకు ఇవ్వాలె?!  రైతులు అలుకగ దొరికండ్రా. రైతుల గొంతుక కేసీఆర్​. రైతుభూమి రైతుకే ఉండాలె. గోల్ మాల్  చేయొద్దు. రైతుకు బాధలేకుండా రెవెన్యూ యాక్ట్​ను జూన్లో లేకపోతే జూలైలో తెస్తం. దాన్ని మేధావులకు అప్పగించినం.  రెవెన్యూ రి కార్డులు సాఫ్​ కావాల్నని మేం చేస్తా ఉంటే.. తప్పుచేస్తున్నట్టు కొన్నిపత్రికలు రాస్తున్నయి. రెవెన్యూ రి కార్డులు సాఫ్​ కావాల్నా వద్దా? జూన్ దా కా ఓపిక పట్టుండ్రి. ఎట్ల చేయాల్నో అట్ల చేసి చూపిస్త.

నెలలో మిషన్ భగీరథ..జిల్లాలకు వస్తా

నెల రెండునెలల్లో మిషన్ భగీరథ పూర్తయితది. కలల కూడా అనుకున్నమా? నీళ్లు మన ఇంట్లకే వస్తయని. అయిపోతా ఉన్నది. ఎన్నికల తర్వాత ఒక్కొక్క జిల్లాల్లో మూడు మూడు రోజులు నేనే ఉంట. అన్ని సమస్యలు కూడా జిల్లాల్లో ప్రజాదర్బార్​లు పెట్టి పరిష్కరించుకుందం.