బహిరంగ చర్చకు రావాలి.. కిషన్ రెడ్డికి కేసీఆర్ సవాల్

బహిరంగ చర్చకు రావాలి.. కిషన్ రెడ్డికి కేసీఆర్ సవాల్

కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోతుందన్నారు సీఎం కేసీఆర్. వర్షాకాలం ఎంత ధాన్యం వచ్చినా తాము కొంటామన్నారు. కేంద్రం కొనకపోతే బీజేపీ ఆఫీస్, ప్రధాని ఆఫీస్ దగ్గర పోస్తామన్నారు. లారీలు పెట్టి ఢీల్లీ ఇండియా గేట్ దగ్గర పోస్తామన్నారు. బీజేపీ పనికి మాలిన పార్టీ అని అన్నారు. తాము రైతులకు అనుకూలం తప్ప ఎవ్వరీకి కాదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పి..తన మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. కిషన్ రెడ్డి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటో ,రెండో పోతయ్ అది లెక్కకాదన్నారు. రాష్ట్రం చేతిలో ఉన్నవన్నీ కడుపునిండా ఇస్తామన్నారు. కేంద్రం తెచ్చిన పవర్ బిల్లుకు తాము వ్యతిరేకమన్నారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పై కొట్లాడతామన్నారు. రూ.22.5 కోట్లు కేబినెట్ మంజూరు చేసిందన్నారు.