లాక్ డౌన్ పై భారత్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసించాయని తెలిపారు సీఎం కేసీఆర్. ఆదివారం లాక్ డౌన్ పై ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం.. సీరియస్ గా ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. డాక్టర్లు, పోలీసులకు అందరూ సహకరించాలన్నారు. సౌత్ కొరియాలో ఒకే వ్యక్తి ద్వారా 50వేల మందికి వచ్చిందని.. రాష్ట్రంలో కొత్త కేసులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు.
కొత్త కేసులు చేరకుంటే ఏప్రిల్ 7లోగా కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. వ్యాధికి మందులేదు సెల్ఫ్ కంట్రోల్ మాత్రమే మన ఆయుధం. మార్చి 30 నుంచి క్వారంటైన్ గడువు పూర్తి చేసుకుని ఆరోగ్యంగా ఉన్నవారినందరినీ డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.
