కార్మికులకు సమ్మె కాలానికీ జీతం పైసలు: కేసీఆర్

కార్మికులకు సమ్మె కాలానికీ జీతం పైసలు: కేసీఆర్

హైదరాబాద్: సమ్మె కాలానికి సంబంధించిన జీతం కూడా కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. సమ్మె తర్వాత తిరిగి విధుల్లోకి చేరిన ఆర్టీసీ కార్మికులతో ఆదివారం ప్రగతి భవన్‌లో భేటీ అయిన సీఎం కేసీఆర్ వారిపై వరాల జల్లు కురిపించారు. సమ్మె వల్ల పెండింగ్‌లో పడిన సెప్టెంబరు నెల జీతాన్ని సోమవారమే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 55 రోజుల సమ్మె కాలం నాటి జీతం కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు.

ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అలాగే సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఆ కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామన్నారు.

MORE NEWS:

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు

ఆర్టీసీలో రెండేళ్లు నో యూనియన్స్.. ముందు పని చేయాలే

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు