టీఆర్ఎస్ కు అధిష్టానం లేదు..బాసులు లేరు

టీఆర్ఎస్ కు అధిష్టానం లేదు..బాసులు లేరు

హైదరాబాద్: అనేక అనుమానాల మధ్య గులాబీ జెండా ఎగిరిందని తెలిపారు సీఎం కేసీఆర్. రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని తెలిపారు. మ‌న ప‌థ‌కాల‌ను ఇత‌ర రాష్ట్రాలు మాత్ర‌మే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుంద‌న్నారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌పై  కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన సీఎం..ఎన్నో కష్టాలతో తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఏడేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని సంతోషం వ్యక్తం చేశారు. అనేక రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో మనమే టాప్ అన్నారు. వెనకబడ్డ పాలుమూరుకు కూలీలు ఇతర రాష్ట్రం నంచి రావడం అభివృద్ధి కాదా అన్నారు. నేడు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. రైతలకు నేడు బతుకు మీద ఆశ పుట్టిందన్న కేసీఆర్.. రైతుబంధు, రైతుబీమా, పండించిన పంటలను ప్రభుత్వమే కొనడంతో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఎన్నో  పూర్తి చేశామని చెప్పారు. ఆగమైపోయిన తెలంగాణన అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ఇది అద్భుతమై విజయమని.. దేశంలోనే దళితబంధు సంచలనం అన్నారు.

పనులు చేయాలంటే సాహసం కావాలని.. కలగనడంకదని సాధించుకున్నప్పుడే నిజమైన విజయం అన్నారు. టీఆర్ఎస్ జెండా లేపినప్పుడు ఎన్నో విమర్శలు ఎదురైనాయన్నారు. చివరకు ఎన్నో పోరాటలతో కొట్లాడి తెలంగాణను సాధించుకున్నం అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటైపోతుందన్న ఏపీ నేతలే.. ఇప్పుడు మన రాష్ట్రాన్ని చూసి ఆశ్చర్యపోతన్నారని చెప్పారు. నేడు ఏపీలో కరెంట్ కోతలుంటే.. తెలంగాణలో 24 గంటల కరెంటు వస్తుందన్నారు ఆనాడ ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను తీసేసినట్లే..ఇప్పుడు వీఆర్వో వ్యవస్ధను రద్ధు చేశామన్నారు. దీంతో ధరణితో 5 నిమిషాల్లో రిజిష్ట్రేషన్ పూర్తవుతుందని..ఒక్కసారి ధరణిలో పేరు నమోదైతే తీసేసే హక్కు ఎవ్వరికీ ఉండదన్నారు. ఉన్న వనరలను అతి జాగ్రత్తగా వాడుకుంటూ అద్భుతంగా దూసుకుపోతున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని.. తెలంగాణ నలువైపులా కలుపుకుని పోతున్నామన్నారు. ఇదే ఉధృతిని భవిష్యత్ లోనూ కొనసాగించాలన్నారు. అందరం కలిసి కష్టపడ్డాంకాబట్టే 20 వసంతాలు పూర్తి చేసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కర్నాటక, మహారాష్ట్ర మన పథకాలను మెచ్చుకున్నాయని..ఏపీలోనూ పార్టీని విస్తరించాలని వినతులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని పార్టీల్లో నిలబడమంటే నిలబడాలి.. కూర్చోమంటే కూర్చోవాలని..కానీ టీఆర్ఎస్ లో అలా కాదన్నారు. టీఆర్ఎస్ కు అధిష్టానం లేదు..బాసులు లేరు.. ప్రజా పునాదిగల పార్టీ ఒక కుటుంబం లాంటిదని చెప్పుకొచ్చారు గులాబీ బాస్.