భూముల ధరలు అమాంతం పెరిగాయి

భూముల ధరలు అమాంతం పెరిగాయి
  • రాష్ట్ర అభివృధ్ధిలో భూముల ధరలు అమాంతం పెరిగాయి
  • రాబోయే రోజుల్లో భూములు బంగారమైతయ్
  • భువనగిరి లాగే భూపాలపల్లి అభివృద్ధి

జనగామ: ఏడు సంవత్సరాల క్రితం ఎట్లున్న తెలంగాణలో ఇప్పుడు అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం ఆయన జనగామన పర్యటించారు. జ‌న‌గామ అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఒక‌ప్పుడు జ‌న‌గామ ప‌రిస్థితి చూస్తే క‌న్నీళ్లు వ‌చ్చేవిని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు జ‌న‌గామ‌లో అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు.  కొత్త క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించి, కలెక్టరేట్ లో ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంత‌రం మాట్లాడిన కేసీఆర్.. జనగామ చుట్టుపక్కల కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా లేకుండె అన్నారు. బచ్చన్నపేట మండలం కరువు తాండవం చేసిందన్నారు. జనగామ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సారు ఎన్నోసార్లు తాపత్రయపడ్డారని తెలిపారు. ఎన్నోఒడిదొడుకులు ఎదుర్కొని నిలబ్డామని చెప్పారు. మంచినీరు, సాగునీరు, భూముల ధరలు అమాంతం పెరిగాయన్నారు. అభివృద్ధి కోసం జిల్లా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో అధికారుల పాత్ర ఎంతో ఉందన్న సీఎం.. తెలంగాణకు కరువు అనేది రాదన్నారు. కరెంటు 24 గంటలు ఉంటుందన్నారు. తెలంగాణ వచ్చింది.. అభివృద్ధి చెందింది.. అలాగే కొనసాగుతుందన్నారు. 

మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్న సీఎం.. ఏడు గ్రామాలకు కేంద్రం అవార్డులు వచ్చాయన్న సీఎం..టాప్ 10లో ఏడు మన తెలంగాణ పల్లెలె అన్నారు. మారుమూల ప్రాంతాల అభివద్ధి కోసమే జోనమ్ సిస్టం అన్నారు. భువనగిరి లాగే రాబోయేకాలంలో భూపాలపల్లి అభివృద్ధి చెందుతుందన్నారు. ఒకప్పుడు చెట్లు నరుకుడు తప్ప పెట్టుడు లేకుండే.. ఇప్పుడు హరితహారంతో ఉద్యానవనాలు వచ్చాయన్నారు. ఏడేండ్ల కింద రూ. రెండు ల‌క్ష‌ల విలువ‌న్న ఎక‌ర భూమి.. ఇప్పుడు రూ. రెండు, మూడు కోట్ల‌కు చేరింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక‌ర పొలం రూ. 25 ల‌క్ష‌ల‌కు త‌క్కువ పోత‌లేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సాధ్య‌మైంది. అధికారులు కూడా రాత్రింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డి ప‌ని చేశారు. సీఎస్, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. వాసాలమర్రిలో ఇప్పుడు ఎకరం కోటి రూపాయలు అయ్యిందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో రాబోయే రోజుల్లో భూములు బంగారమైతయన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర సీఎంగా, రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా నాకింత కంటే గర్వం ఏముంటదన్నారు. త్వరలో రాబోయే డేటాలో తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 70వేలు కాబోతోందన్నారు. కులపిచ్చి, మతపిచ్చి రాష్ట్రంలో లేదన్న కేసీఆర్..మనమిచ్చే డబ్బుతోనే పేదంటి పెండ్లి చేసుకునే పరిస్థితి అన్నారు. దరఖాస్తు లేదు, దస్తర్ లేదు, బ్యూటిఫుల్ సిస్టం తెచ్చామన్నారు. చిన్న సమస్యలతో ప్రళయం కాదు, అమెరికా నుంచి వచ్చి ఎవరూ పరిష్కారం చేయరు, చిన్న ఇష్యూస్ ఉంటే కూర్చుని పరిష్కరించుకుందామన్నారు. ఈ కార్యాలయం కట్టింది మన తెలంగాణ బిడ్డనే, ఉషారెడ్డిగారు, మనకు కట్టుకునే తెలివే లేదన్నారు, మన ఆడబిడ్డనే డిజైన్ చేసి కట్టించారన్నారు.  ఉద్యోగం, ప్రమోషన్ లాంటివి మూడు పేజీలు ఉంటే చాలు, నేను సీఎస్ గారితో కొట్లాడతున్నా అన్నారు. రిటైరయ్యేనాటికి ప్యాకేజీ తయారు కావాలని.. ప్రభుత్వ వాహనంలో ఇంటి దగ్గర దిగబెట్టే రోజు రావాలన్నారు. ఆందోళనల పంచాయితీ అయిపోయింది, ఇంకేం ఉన్నా అర్థంచేసుకొని కుటుంబ సభ్యుల్లా పనిచేద్దామన్నారు. కుండలో ఉంటేనే కదండీ మీకు జీతాలు వస్తాయి, ఉన్నాయి కాబట్టే వస్తున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్.

మరిన్ని వార్తల కోసం:

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?

నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతా