వచ్చే నెల 4న నిర్మల్ కు సీఎం కేసీఆర్

వచ్చే నెల 4న నిర్మల్ కు సీఎం కేసీఆర్

నిర్మల్, మంచిర్యాల,  వెలుగు:  సీఎం కేసీఆర్ జూన్ 4 న నిర్మల్ కు రానున్నారు. ఏడేళ్ల తర్వాత సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా కేంద్రంలో అడుగుపెట్టనున్నారు.  జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, చించోలి వద్ద నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్  భవనాలను, బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభిస్తారు.  సీఎంవో నుంచి సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.  

సీఎం కేసీఆర్ 2016 లో మొదటిసారి సీఎం హోదాలో  కడెం మండలంలో  జరిగిన లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో  పాల్గొన్నారు.  అదే సంవత్సరంలో  కొత్తగా నిర్మల్ జిల్లా ఏర్పడింది. అప్పటి నుంచి సీఎం జిల్లాకు రాలేదు. సీఎం కేసీఆర్ ఐదేళ్ల తర్వాత జూన్ 9న మంచిర్యాల జిల్లాకు రానున్నారు. సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.   సీఎం టూర్​కోసం కొత్త కలెక్టరేట్ ఆవరణలో హెలిప్యాడ్ ను రెడీ చేస్తున్నారు.