భారత్ బంద్‌కు సీఎం కేసీఆర్ సపోర్ట్

భారత్ బంద్‌కు సీఎం కేసీఆర్ సపోర్ట్

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో గత పదిరోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ శివార్లలో ధర్నాకు దిగారు. ఆ ధర్నాకు తెలంగాణ సీఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా రైతులు డిసెంబర్ 8న తలపెట్టిన భారత్ బంద్‌కు కూడా తెలంగాణ తరపున మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ బంద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆయన కార్యకర్తలకు పిలుపినిచ్చారు. రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నట్లు ఆయన అన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుందనే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించామని ఆయన అన్నారు. ఈ కొత్త చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాతటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు’ అని టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.

For More News..

రైతుల కోసం ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధం

హయ్యెస్ట్​ మెజార్టీ 18,909.. అత్యల్ప మెజార్టీ 32 ఓట్లు

అగ్రి చట్టాలను రద్దు చేస్తరా.. లేదా? ఎస్ ఆర్ నో