ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు

ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు

జనగామ జిల్లా: ఒకప్పుడు జనగామ ప్రాంతంలో ఉక్కడ చూసినా కరువే అన్నారు సీఎం కేసీఆర్. బచ్చన్నపేట చెరువులో నీళ్లు చూడక ఏడేళ్లు అవుతుందని ఇక్కడి ప్రజలు పలు సందర్భాల్లో చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకున్నా అన్నారు. శుక్రవారం జనగామ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. 14 ఏళ్లు కొట్లాడి చావుదాక పోయివచ్చి ఇప్పుడు తెలంగాణ తెచ్చకున్నామన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు నిండటంతో మంచి పంటలు పండుతున్నాయన్నారు. దీంతో బచ్చన్నపేటలో బతుకులు బాగుపడుతున్నాయన్న కేసీఆర్.. జనగామ జిల్లా చరిత్రలో ఎక్కడా లేని పంటలు పండుతున్నాయని తెలిపారు. జనరేటర్లు మాయమైనయని ఇంటిలోకే మంచినీళ్లు వస్తున్నాయని చెప్పారు. మంచినీళ్ల బాధ పోయిందని..సాగు నీరు ఇంకాస్త ఉందని..  గోదావరి నీళ్లు తెచ్చి జనగామ పాదాలు కడిగే సమయం ఆసన్నమైందన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో అనేక బాధలు పడ్డామన్నారు. రాబోయే ఒక్క ఏడాదిలోపే నీళ్లు వస్తాయన్నారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేవని.. పాలకుర్తికి డిగ్రీ కాలేజీ, స్టేషన్ ఘన్ పూర్ కి డిగ్రీ కాలేజీ, జనగామకి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నా అన్నారు. దళితుల ముఖం బాగుండాలంటే దళితబంధు వందకు వంద శాతం అమలు అవుతుందన్నారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు ఇవ్వనున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 2 వేల కుటుంబాలకి దళితబంధు వస్తుందన్నారు.