ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్

ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఇవాళ పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్.రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి యాదాద్రిని సందర్శించనున్నారు.పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. వచ్చే మార్చి లేకపోతే ఏప్రిల్ లో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ వేడుకను కన్నుల పండువగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులను ఆహ్వానించడంతో పాటు ఆలయ ప్రారంభోత్సవ క్రతువును ఎలా నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్.  భక్తుల కానుకలతో కట్టే భవనాల నిర్మాణాలు  ఏ విధంగా ఉండాలనే దానిపై అధికారులతో చర్చిస్తారు. ఇందుకోసం డోనర్స్ తో మాట్లాడి ఒక పాలసీని డిసైడ్ చేస్తారు. భక్తుకులకు తాగునీటిని అందించేందుకు  తీసుకోవాల్సిన చర్యలపై మిషన్ భగీరథ అధికారులోత చర్చిస్తారు.

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ దివ్యవిమాన గోపురం, స్వాగత గోపురం, రాజగోపురాలు శిల్పకళతో మెరిసిపోతున్నాయి. దాంతో యాదాద్రి శోభాయమానంగా మారుతోంది. ప్రధానాలయ నిర్మాణం పనులు 90శాతం పూర్తి అయ్యాయి. ఆలయం లోపల ఆళ్వార్ల విగ్రహాలు, ఆంజనేయ స్వామి ఆలయం పూర్తి చేశారు. ఫ్లోరింగ్ పనులు, విగ్రహాల ఏర్పాటు చేయడమే మిగిలి ఉంది. నెల రోజుల్లో అన్నింటిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రధానాలయానికి అనుబంధంగా నిర్మిస్తోన్న శివాలయం పనులు 70శాతం కంప్లీట్ అయ్యాయి. తిరుమాఢ విధులు కూడా దాదాపు పూర్తి చేస్తున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. వీఐపీ సూట్స్ నిర్మాణం 50శాతం కంప్లీట్ అయింది.

విష్ణు పుష్కరిణి, కల్యాణ కట్ ట,సత్యనారాయణ స్వామి వ్రతమండప నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. 20 వేల మంది కూర్చొని స్వామివారి కల్యాణాన్ని చూసే విధంగా కల్యాణ మండపం నిర్మించాలని ప్లాన్ చేశారు. కొండ చుట్టూ  గిరిప్రదర్శన కోసం నిర్మిస్తున్న రోడ్డు పనులు 50శాతం పూర్తి చేశారు. కొండకు వచ్చే నలుదిక్కుల్లో ఉన్న రోడ్ల సుందరీకారణతో పాటు… ప్లాంటేషన్ కూడా అద్భుతంగా చేశారు. జింకల అభయారణ్యం కూడా ముస్తాబు అయింది. మినీ ట్యాక్ బండ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొండ కింద బస్ డిపో, బస్ స్టాప్ నిర్మాణాలకు స్థలం ఇంకా ఖరారు కాలేదు. రేపటి సీఎం పర్యటన తర్వాత వీటన్నింటినిపై క్లారిటీ రానుంది.