యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన కేసీఆర్

యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన కేసీఆర్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి టూర్ లో భాగంగా….ముందుగా ఆలయ పనులు జరగుతున్న తీరుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం యాదాద్రికి వెళ్లారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ అధికారులు, పూజారులు. ఆ తర్వాత బాలాలయంలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో పాటు…ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, సంతోష్, నల్గొండ జిల్లా నేతలు వెళ్లారు.

బాలాలయంలో ఆలయంలో పూజల తర్వాత…..బయట జరగుతున్న పనులను పరిశీలిస్తున్నారు సీఎం కేసీఆర్. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తూర్పు, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ దివ్యవిమాన గోపురం, స్వాగత గోపురం, రాజగోపురాలు శిల్పకళలను పరిశీలిస్తున్నారు.

కాసేపట్లో పనులపై అధికారులతో సమీక్షించనున్నారు సీఎం. వచ్చే మార్చి లేకపోతే ఏప్రిల్ లో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ వేడుకను కన్నుల పండువగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులను ఆహ్వానించడంతో పాటు ఆలయ ప్రారంభోత్సవ క్రతువును ఎలా నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్. భక్తుల కానుకలతో కట్టే భవనాల నిర్మాణాలు  ఏ విధంగా ఉండాలనే దానిపై అధికారులతో చర్చిస్తారు. ఇందుకోసం డోనర్స్ తో మాట్లాడి ఒక పాలసీని డిసైడ్ చేస్తారు. భక్తుకులకు తాగునీటిని అందించేందుకు  తీసుకోవాల్సిన చర్యలపై మిషన్ భగీరథ అధికారులతో చర్చిస్తారు.