కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న సీఎం

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న సీఎం

సీఎం కేసీఆర్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. పర్యటనలో భాగంగా  జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్ పంపు హౌస్ కు చేరుకుని అక్కడి పనులను పరిశీలించారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని, జులై నాటికి వాటర్ లిఫ్టింగ్ పనులు జరిగేలా చూడాలని తెలిపారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలని అన్నారు. అనంతరం సీఎం అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారెజీకి బయల్దేరారు.