జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌజ్ ను పరిశీలించారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం నుంచి నేరుగా కన్నెపల్లి వచ్చిన సీఎం…అధికారులతో కలిసి పంప్ హౌజ్ కు చేరుకున్నారు. ప్రాజెక్టు పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. వెట్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక ముందు జరగాల్సిన పనులపై ఇంజినీర్లు, అధికారులకు సూచనలు చేశారు.
తర్వాత మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు సీఎం.పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ముందు జరగాల్సిన ప్రాజెక్టు పనులపై అధికారులు, ఇంజినీర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
అంతకుముందు కాళేశ్వరంలో..కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం.
