సీఎం కేసీఆర్ మాట్లాడే తీరు సరిగా లేదు: రాములు నాయక్

సీఎం కేసీఆర్ మాట్లాడే తీరు సరిగా లేదు: రాములు నాయక్

ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు సరైంది కాదన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. విపక్షాల నాయకులను తక్కువ చేస్తూ మాట్లాడే మాటలు వింటుంటే బాధేస్తుందన్నారు. ఒకరి గురించి మాట్లాడేప్పు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవుతు పలికారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్…సైనికుడు, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బ్రోకర్ అనడం దారుణమన్నారు.దేశం కోసం పనిచేసిన వారిని అవమానిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేస్తూ… రాజకీయ వ్యభిచారం చేస్తుంది నువ్వు కదా..? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. నీ పార్టీ లో నువ్వు, నీ కొడుకు ఇద్దరే మాట్లాడుతున్నారన్న రాములు నాయక్…నువ్వేమైనా నార్త్ కొరియా కిమ్ అనుకుంటున్నావా అని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి… తాగు , కొట్లాడు అన్నట్లుగా తయారైందని ఆరోపించారు రాములు నాయక్. ఈ  రోజు నీ ఇంట్లో అందరికి పదవులు ఉన్నాయి,రేపు నీ మనవడికి ఇస్తావన్నారు. క్యాబినెట్ లో మైనారిటీ ,ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదన్నారు. TRS పార్టీ ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ గా మారిందని ఆరోపించారు. సీఎం కాకముందు నీ ఆస్తులు ఎంత..! ఇప్పుడు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు రాములు నాయక్.

ఉద్యమ సమయంలో ఇంట్లో పెళ్ళికి కూడా సంకెళ్లతో  చెరుకు సుధాకర్ వచ్చారని తెలిపారు రాములు నాయక్.