సీఎం సభకు వైరా రెడీ..రుణమాఫీ చెక్కులు పంపిణీ అక్కడే

సీఎం సభకు వైరా రెడీ..రుణమాఫీ చెక్కులు పంపిణీ అక్కడే
  • రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చెక్కులు ఇవ్వనున్న సీఎం
  • సీతారామా ప్రాజెక్టు 3 పంపులు ఒకే సారి ప్రారంభం
  • ప్రారంభించనున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి కోమటిరెడ్డి
  • మధ్యాహ్నం వైరాలో భారీ బహిరంగ సభ
  • అక్కడే రైతుల ఖాతాల్లోకి రూ. 2 లక్షలలోపు రుణమాఫీ డబ్బు విడుదల

ఖమ్మం: చరిత్రాత్మకమైన రుణమాఫీ అంకం రేపటితో పరిపూర్ణం కానుంది. రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా వైరా వేదికగా సాగే ఈ కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. భారీ వేదికను ఏర్పాటు చేశారు. మువ్వన్నెలతో వేదికను తీర్చిదిద్దారు. రైతులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

మ్మం జిల్లాలోని  సీతారామా ప్రాజెక్టును రేపు ప్రారంభించనున్నారు. మూడు పంప్ హౌస్ లను ఒకే సారి ప్రారంభించేలా అధికారులు ప్లాన్ చేశారు. పూసుగూడెం పంప్ హౌస్  ను  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదే సమయంలో కమలాపురం పంప్ హౌస్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేస్తారు.

జీ కొత్తూరు పంప్ హౌస్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి వైరా చేరుకుంటారు. అక్కడే  తుది విడుత రుణమాఫీకి సంబంధించిన చెక్కును అందిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొత్తు జమవుతుంది.