సీఎం నితీశ్ కుమార్మానసిక స్థితి బాలేదు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శ

సీఎం నితీశ్ కుమార్మానసిక స్థితి బాలేదు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శ

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మానసిక స్థితిపై ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అనుమానాలను లేవనెత్తారు. ఆయనకు ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యంలేదని తెలిపారు. శనివారం (అక్టోబర్ 05) ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా.. దీనికి సీఎం నితీశ్ వర్చువల్​గా హాజరయ్యారు. 

ఈ ఫంక్షన్ లో సీఎం నితీశ్ ప్రవర్తించిన తీరును ఉద్దేశించి తేజస్వీపై వ్యాఖ్యలుచేశారు. ఈ ఫంక్షన్​కు సంబంధించిన వీడియోను ఆదివారం తేజస్వీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. “బిహార్ సీఎం నితీశ్ కుమార్​ను ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో చూసి మీకేమనిపిస్తుంది? ఈ ఫంక్షన్​లో సీఎం నితీశ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మెంటల్ హెల్త్ బాగుందనిపిస్తుందా?  ఆయనకు విషపూరితమైన ఆహారపదార్థాలు పెట్టి బీజేపీ, దాని సన్నిహిత పార్టీలు ఏదైనా కుట్ర పన్నాయా? బిహార్ ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు’’ అని తెలిపారు. 

అనంతరం తేజస్వీ యాదవ్ విలేకర్లతో మాట్లాడారు. ‘‘కొంతకాలంగా సీఎం నితీశ్ మానసిక స్థితి సరిగ్గా లేనట్టు ప్రవర్తిస్తున్నారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు” అని గుర్తుచేశారు.