V6 News

సోనియా, రాహుల్తో సీఎం రేవంత్, మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ

సోనియా, రాహుల్తో సీఎం రేవంత్, మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ

ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిశారు. వీరిని కలిసిన వారిలో మంత్రి వివేక్ వెంకటస్వామి, టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సీఎం, మంత్రి వివేక్ వివరించారు. 

గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడం,పెట్టుబడుల వివరాలను సోనియాకి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ కావడం గమనార్హం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ ఘన విజయం సాధించడంపై మంత్రి వివేక్​ వెంకటస్వామిని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అభినందించారు.

ఉప ఎన్నికలో ఇన్‌‌చార్జ్‌‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయనను.. ‘వెల్ డన్ వివేక్’ అని భుజం తట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి బుధవారం రాత్రి కూడా మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో.. జూబ్లీహిల్స్‌‌ ఎన్నికల్లో విజయానికి కలిసి వచ్చిన అంశాలపై చర్చించారు. 

►ALSO READ | సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి

జూబ్లీహిల్స్​ బైపోల్​ ప్రచారం, కేడర్‌‌ మొబిలైజేషన్‌‌లో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు అందించిన సహకారాన్ని కూడా ఖర్గేకు మంత్రి వివేక్​ వివరించారు. సమిష్టి కృషితోనే కాంగ్రెస్‌‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించారని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌‌లో వ్యూహాత్మక ప్రణాళికలు రచించి పార్టీని విజయం వైపు నడిపించినందుకు గాను మంత్రి వివేక్‌‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్​, తుమ్మల నాగేశ్వర్​రావును ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు.