నస్సూర్, వెలుగు: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణా కోర్సులను నేర్చుకోవడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలని శ్రీరాంపూర్ఏరియా సింగరేణి జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్లో బుధవారం నిర్వహించిన 25వ సింగరేణి సేవా సమితి ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా అనేకమంది మహిళలు ఉచిత వృత్తి శిక్షణ కోర్సులు నేర్చుకుని తమ కాళ్లమీద నిలబడ్డారని తెలిపారు.
2025–26 సంవత్సరానికి గాను టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి, ఏఐటీయూసీ నాయకులు బాజీ సైదా, సీనియర్ పీవో సురేందర్, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, వృత్తి శిక్షణ కోర్సుల ట్రైనర్లు, సేవా సభ్యురాళ్లు పాల్గొన్నారు.
ఘనంగా సింగరేణి సేవా సమితి ఆవిర్భావ వేడుకలు
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రిలోని సింటార్స్కేంద్రంలో సింగరేణి సేవా సమితి 25వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు, జీఎం సతీమణి శ్రీవాణి కేక్ కట్ చేశారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.
సింగరేణి సేవా సమితి ద్వారా సింగరేణి కార్మిక, కార్మికేతరుల నిరుద్యోగ యువతీయువకులకు, ప్రాజెక్టు ప్రభావిత పరిసరాల ప్రాంతాల వాసులకు వివిధ వృత్తి విద్యపై ఉచిత శిక్షణ ఇస్తూ వారిని ఆర్థికస్వావలంబన దిశగా ప్రోత్సాహిస్తోందన్నారు.
మహిళలకు కుట్టు శిక్షణ, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, యువతీయువకులకు కంప్యూటర్, పోలీస్, ఆర్మీ రిక్రూట్మెంట్ అంశాలపై శిక్షణ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో సింగరేణి సీనియర్పీవో శంకర్, లేడిస్క్లబ్సెక్రటరీ మణి, ట్రెజరర్ కవి, సేవ మెంబర్ రజిత, సేవా కోఆర్డినేటర్ నెల్సన్తదితరులు పాల్గొన్నారు.

