మాజీ DSP నళినికి సీఎం రేవంత్ కానుక.. అవన్నీ సెటిల్ చేస్తామంటూ కలెక్టర్తో సందేశం

మాజీ DSP నళినికి సీఎం రేవంత్ కానుక.. అవన్నీ సెటిల్ చేస్తామంటూ కలెక్టర్తో సందేశం

అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించారు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఆమెను కలిసి భరోసా ఇచ్చారు. సీఎం సందేశాన్ని ఆమెకు వినిపించారు. సోమవారం (సెప్టెంబర్ 22) భువనగిరి పట్టణంలో ఆమెను కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. 

మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్య పరిస్థితి గురించి లేఖలో పేర్కొన్న ఆమె ఆవేదన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమెను పరామర్శించాలని సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. సీఎం ఆదేశాలతో నళిని ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. 

ఆమె టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్ తో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయుర్వేద మందులు వాడుతున్నారు, ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మెరుగు పడుతుందని చెప్పారు. నళిని ఆరోగ్య పరిస్థితులు, ఆమె ఆవేదన ను తెలుసుకోవాలని తనను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. 

నళినికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారని కలెక్టర్ తెలిపారు. ఆమె వైద్య ఖర్చులు, అంతకు ముందు అయిన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఆమెకు రావాల్సి ప్రభుత్వ బెనిఫిట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. బెనిఫిట్స్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాని తెలిపారు కలెక్టర్ హనుమంతరావు.