
- బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డికి కులగణనపై చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్అన్నారు. కేవలం రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టే కులగణన చేస్తున్నామని సీఎం చెప్పడం అగ్రకుల ఆధిపత్య అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ‘‘బీసీల అభ్యున్నతిపై తనకు బాధ్యత లేనట్టుగా సీఎం మాట్లాడటం.. నమ్మకద్రోహం, సామాజిక నేరం, రాజ్యాంగ ఉల్లంఘనే. సీఎం సీట్లో కూర్చున్నా కూడా రేవంత్‌రెడ్డికి అగ్రవర్ణ అహంకారం పూర్తిగా పోయినట్టు లేదు. ఇలాంటి వివక్షాపూరిత కులాధిపత్య మనస్తత్వం ఉన్న రేవంత్‌రెడ్డి.. సీఎం సీట్లో కూర్చునేందుకు అనర్హుడు. కులగణన నిర్వహించేందుకు ఆయనకు ఏమాత్రం నైతికత లేదు. బీసీలకు న్యాయం చేయలేరు” అని దాసోజు శ్రవణ్ అన్నారు.