ఎస్సై వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం:  సీఎం 

ఎస్సై వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం:  సీఎం 

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ గణేశ్‌‌ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్‌‌ ఎస్సై కె. వెంకన్న గుర్తుతెలియని వాహనం ఢీకొని  మృతి చెందడం అత్యంత బాధాకరమని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని పేర్కొన్నారు.

వెంకన్న మృతి ఆయన కుటుంబానికే కాకుండా మొత్తం పోలీసు శాఖకు తీరని లోటని అన్నారు. వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.   ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.