కాళేశ్వరం నీళ్లు లేకున్నా మస్త్ పంట పండింది: పాలమూరు రైతు పండుగలో సీఎం రేవంత్

కాళేశ్వరం నీళ్లు లేకున్నా మస్త్ పంట పండింది: పాలమూరు రైతు పండుగలో సీఎం రేవంత్

మహబూబ్ నగర్: కాళేశ్వరం వల్లే వరి పండిందని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, కాళేశ్వరం నీరు చుక్క ఇవ్వకపోయినా రికార్డ్ స్థాయిలో పంట పండిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పాలమూరు రైతు పండుగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కోటీ 53 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించారని చెప్పారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరే అన్నదని, తాము వరి వేస్తే రూ.500 బోనస్ అంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 

రూ.11 వేల కోట్లు బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తే.. రూ.8 వేల కోట్లు మిత్తీలకే పోయాయని సీఎం ఆరోపించారు. రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని సీఎం రేవంత్ నినదించారు. కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం కుప్పకూలిందని సీఎం విమర్శించారు. తమకు పాలన వచ్చని, నిధులు తెచ్చుకోవడం కూడా వచ్చని రేవంత్ వ్యాఖ్యానించారు.

ALSO READ | రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీ నిధులు విడుదల

రైతుల కష్టాలు ఏంటో తనకు తెలుసని, సీఎం పదవి తన బాధ్యత అని.. జవాబుదారీతో పనిచేస్తున్నానని సీఎం చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని సీఎం మండిపడ్డారు. రుణమాఫీపై చర్చకు మోదీ, కేసీఆర్ సిద్ధమా అని సీఎం ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ పాలమూరు నుంచి పోటీ చేస్తే కడుపులో పెట్టుకుని గెలిపించామని, వచ్చిన తెలంగాణలో పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని రేవంత్ నిలదీశారు. 70 ఏండ్ల తర్వాత పాలమూరుకు అవకాశం వస్తే కుట్ర చేశారని, పాలమూరును ఎవడో వచ్చి దత్తత తీసుకునుడేందని, తమకు పాలన వచ్చని, నిధులు తెచ్చుకోవడం కూడా వచ్చని సీఎం చెప్పారు.

లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ స్పందన:
* 1300 ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నా కోసమా ?
* పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలని నా తపన
* గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా.. ప్రాజెక్టులు కట్టలేదా ?
* గతంలో అధికారులపై దాడులు చేసి ఉంటే ప్రాజెక్టులు వచ్చేవా ?
* అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు నష్టపోవాల్సిందే
* అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాలి
* మాయగాళ్ల మాటలు విని పరిశ్రమలను అడ్డుకుంటున్నారు
* ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చే బాధ్యత నాది
* అభివృద్ధిని అడ్డుకోవద్దు.. సహకరించండి
* మల్లన్న సాగర్లో బాధితులు ఎంత బాధపడ్డారో హరీశ్కు కనపడలేదా ?
* పాలమూరు భూమిని పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా ?
* పాలమూరు జిల్లాకు నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా ?
* కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా
* 25 వేల మందికి ఉపాధి కల్పిస్తాం.. ఇది నా బాధ్యత: సీఎం రేవంత్
* మాయగాళ్ల మాట విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుక్కోవద్దు