రేపు హిమాన్ష్ కూడా వస్తనంటడు.. బీఏసీ మీటింగ్ పై సీఎం రేవంత్

  రేపు హిమాన్ష్ కూడా వస్తనంటడు.. బీఏసీ మీటింగ్ పై  సీఎం రేవంత్

హైదరాబాద్: బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ తరఫున కేసీఆర్, కడియం శ్రీహరి హాజరవుతారని పేర్లు ఇచ్చారని, కేసీఆర్ కు బదులుగా హరీశ్ రావు వచ్చారని, అనుమతించాలా..? లేదా..? అనేది స్పీకర్ నిర్ణయమని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలా అయితే రేపు హిమాన్షు కూడా వస్తానంటాడని అన్నారు. తాము కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసు మార్పు అంశం కూడా స్పీకర్ నిర్ణయమేనని చెప్పారు. 

కేసీఆర్ సభకు రావాలని, ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వర్తించాలని అన్నారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్  జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఆయన భేషరం మనిషని మండిపడ్డారు. కేఆర్ ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది గత ప్రభుత్వమన్నారు. ప్రతి రోజూ 12 టీఎంసీ లను ఏపీ తీసుకుని వెళుతుంటే.. కేసీఆర్ అడ్డుకోలేదని  చెప్పారు. విజయసాయిరెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.  

కాళేశ్వరం పై ప్రొసీజర్  తో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కసబ్ కు ఉరి కూడా.. ప్రొసీజర్ తోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు.  టీఎస్పీఎస్సీ విషయంలో పూర్తి స్థాయి ప్రోసీజర్ తో ముందుకు వెళ్తున్నామని, భవిష్యత్తులో నిరుద్యోగులకు ఇబ్బందులు ఉండకుండా చూస్తామని చెప్పారు.