సైబర్ నేరాలను కట్టడి చేయడంలో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్

సైబర్ నేరాలను కట్టడి చేయడంలో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్

మంగళవారం ( అక్టోబర్ 21 )  గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. సాంకేతికతతో నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్ గా నిలిచిందని అన్నారు. దేశంలోనే మన పోలీస్ శాఖ అగ్రగామిగా నిలవడం గర్వంగా ఉందని అన్నారు.తీవ్ర వాదం, సైబర్ నేరాలు, మాదక ద్రావ్యాలు రాష్టంలో పెరగకుండా అదుపులో కి తీసుకురావడం లో పోలీస్ శాఖ కృషి బావుందని అన్నారు సీఎం రేవంత్.

డ్రగ్స్ నిర్ములన చేయడం కోసం ఈగల్ టీంను ఏర్పాటు చేశామని అన్నారు.సైబర్ నేరాలు, డిజిటల్ నేరాలు పెద్ద సవాల్ గా మారుతున్నాయని.. సాంకేతికత తో నేరాలను అదుపులో కి చెయ్యడం లో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్ గా నిలిచిందని అన్నారు సీఎం రేవంత్. మావోయిస్టు కార్యకలాపాలు కట్టడి చెయ్యడం లో పోలీస్ పనితీరు మరచిపోలేమని.. మావోయిస్టు లు జన జీవన శ్రవంతి లో కలవాలని కోరుకుంటున్నానని అన్నారు.

మహిళ IPS లు అనేక విభాగల్లో పనిచేసేలా చూస్తున్నామని.. మా ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం నిబద్దత తో పనిచేస్తుందని అన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం పోలీస్ నియామకాలకు పెద్ద పీఠ వేస్తుందని.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు దేశంలో ఎక్కడ లేని విదంగా బెనిఫిట్స్ అందిస్తున్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. పోలీస్ కుటుంబాల్లోని పిల్లల విద్యకు రంగారెడ్డి జిల్లా మంచి రేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించామని అన్నారు.