హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

 హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే  హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. 

రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతుండని..  పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? అని హరీష్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు.ఈ సవాల్ కు హరీష్ సిద్ధమా..? అని అన్నారు. 'నేను కేసీఆర్ లాగా మాటలు చెప్పి తర్వాత వదిలేసే వాడిని కాదని.. నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగు' అంటూ చురకలంటించారు. సేవాలాల్ సాక్షిగా చెబుతున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలు గెలిపిస్తే.. కేసీఆర్ లా తాము ఫామ్ హౌస్ లో పడుకుంటులేమని.. ప్రజల్లోకి వెళ్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామాన్నారు సీఎం. పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చూస్తున్నాయన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే.. పాలమూరులో వందేళ్ల అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు.