మోదీతో కలిసి కేసీఆర్ తెలంగాణను బొందలగడ్డ చేసిండ్రు: సీఎం రేవంత్రెడ్డి

మోదీతో కలిసి కేసీఆర్ తెలంగాణను బొందలగడ్డ చేసిండ్రు: సీఎం రేవంత్రెడ్డి

యాదాద్రి భువనగిరి:మోదీ, కేసీఆర్ కుమ్మక్కై పదేళ్లలో తెలంగాణను బొందలగడ్డగా మార్చారని సీఎం రేంవత్ రెడ్డి అన్నారు. మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూ లాయని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే లాగుల తొండలేసి కొట్టిపిస్తా అని హెచ్చరించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ అవమానించింది. తెలంగాణలో ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారుసీఎం రేవంత్ రెడ్డి.లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను తుక్కుతుక్కుగా ఓడించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.  

కురుమ గొల్లలను కేసీఆర్ దారుణంగా మోసం చేశారని.. గెలిచే సీటును కేసీఆర్ కుటుంబ సభ్యులకు, ఓడే సీటు గొల్లకురుమలకు ఇచ్చాడని అన్నారు.రాబోయే రోజుల్లో గందమల్ల, మూసీ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్య తనది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని హామీ ఇచ్చారు. 


రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నిర్ణయం, ప్రత్యేక పరిస్థితుల్లో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన్రు. ఈపదవిని  బాధ్యతగా చూశాను తప్పా.. ఏనాడు అహంకారంతో కుర్చీలో కూర్చోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పారు. 

అరవై ఏళ్ల ఆకాంక్ష, 1200 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణ.. పదేళ్ల పాటు కేసీఆర్ గడిలో బందీ అయిందన్నారు. ఇది చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఏకమై తెలంగాణ తల్లికి విముక్తి కలిగించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.