
హైదరాబాద్ లో ఆకస్మిక పర్యటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ఆదివారం (ఆగస్టు 10) అమీర్ పేట్ లోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అమీర్ పేట్ పరిధిలోని గంగుబాయి బస్తీలో సీఎం రేవంత్ రెడ్డి స్థానికులకు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం వెంటన హైడ్రా కమిషనర్ రంగనాథ్, గ్రేటర్ అధికారులు ఉన్నారు. అమీర్ పేట్ లోని నాలా వ్యవస్థను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ముంపుసమస్యను చెక్ పెడతామని హామీ ఇచ్చారు.
అమీర్ పేట్ పరిధిలోని బుద్దనగర్ బస్తీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. బస్తీవాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా నివసించే 7వ తరగతి చదువుతున్న బాలుడు జస్వంత్ తో సీఎం ముచ్చటించారు. తమ బస్తీకి సీఎం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బాలుడు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాలుడితో మాట్లాడిని వీడియో వైరల్ అవుతోంది.
అనంతరం బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ లో ప్రముఖ క్రికెటర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిర్మాణి ఆత్మకథ STUMPED బుక్ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిర్మాణి ఆత్మకథ STUMPED బుక్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, క్రికెటర్స్ అజారుద్దీన్, మహ్మద్ సిరాజ్ పాల్గొన్నారు.