రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..

రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి,  కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల గురించి రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. సికింద్రాబాద్ ఏరియాలోని డిఫెన్స్ భూముల కేటాయింపుపై చర్చించారు.

 అలాగే,  వరంగల్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు ఇతర అంశాలను రాజ్ నాథ్ సింగ్ కి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీలో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, మల్లు రవి, తదితరులు పాల్గొన్నారు.