షాద్‌న‌గ‌ర్ ప్రమాద ఘ‌ట‌న‌.. కలెక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

షాద్‌న‌గ‌ర్ ప్రమాద ఘ‌ట‌న‌.. కలెక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

షాద్‌న‌గ‌ర్ ప్రమాద ఘ‌ట‌న‌పై అధికారుల‌ను అప్రమ‌త్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.  గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్య చికిత్సలు అందించాల‌ని ప్రమాద స్థలిలోనే ఉన్న క‌లెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.  రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, ప‌రిశ్రమ‌లు, వైద్య బృందాలు స‌మ‌న్వయంతో స‌హాయ‌క చ‌ర్యలు ముమ్మరం చేయాలన్న సీఎం ఆదేశించారు. 

షాద్‌న‌గ‌ర్ లోని సౌత్‌ గ్లాసు పరిశ్రమలో కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.  కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.  ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.  కంప్రెషర్‌ పేలడంతో  ఈ ఘటన జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.  తీవ్ర గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.