సీఎం రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట అర్చకుల వేదాశీర్వచనం

 సీఎం రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట అర్చకుల వేదాశీర్వచనం

యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని రేవంత్ ఇంటికి వెళ్లిన యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు.. ఆలయ సంప్రదాయ రీతిలో ఆలయ ఉప ప్రధానార్చకులు మాధవాచార్యుల అర్చకత్వంలో అర్చకులు, వేదపండితుల బృందం చతుర్వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ఆశీస్సులు అందజేశారు.  

అనంతరం స్వామివారి లడ్డూప్రసాదం, శేషవస్త్రాలు అందజేసి యాదగిరిగుట్ట ప్రధానాలయ నమూనా ఫొటోను బహూకరించారు. మరోవైపు సీఎం రేవంత్ బర్త్ డే సందర్భంగా.. యాదగిరిగుట్ట ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి నామగోత్రాలపై అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మహేష్, అర్చకులు శ్రీకాంత్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.