
అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతప్రతం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 48 గంటలు కాదు..బీఆర్ఎస్ నేతలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు చర్చ పెడతామని చెప్పారు. చర్చకు కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు, కవిత ఎవరొచ్చినా సరేనన్నారు. చర్చ జరిగినంత సేపు కేసీఆర్ సభలోనే ఉండాలని సూచించారు. ఎవరు ఎంత దోపిడి చేశారో సభలో చెబుతామన్నారు రేవంత్.
ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు సీఎం రేవంత్. ఏపీ నీళ్లు దోచుకుపోతుంటే..కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని విమర్శించారు. నీటిపారుదల రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేసశారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ మీదికి ఏపీ పోలీసులు వస్తే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు రేవంత్. దమ్ముంటే ఏపీ పోలీసులను ఇపుడు సాగర్ దగ్గరకు రావాలంటూ సవాల్ చేశారు. 18 నెలల్లో ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రారంభించి నీళ్లిస్తామని చెప్పారు రేవంత్.
ఏపీ నీళ్ల దోపిడికి ముఖ్య కారకుడు కేసీఆరేనని ఆరోపించార సీఎం రేవంత్. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పదేళ్లలో కేసీఆర్ ఒక్క కిలోమీటరే తవ్వించారని చెప్పారు రేవంత్. కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ కృష్ణా నీటి ప్రాజెక్టులు ఎడారిగా మారాయని ఆరోపించారు.పాలమూరు రంగారెడ్డికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్వివ్వలేదన్నారు.27 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ. 67 వే లకోట్లకు అంచనాలు పెంచారని ఆరోపించారు.