కొడంగల్ లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్ లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల కోసం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కొడంగల్ ఎంపీడీవో ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, కొల్లూపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మధ్యాహ్నం 2 గంటల వరకు 89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. లోకల్ బాడీ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.

గద్వాలలో ఉద్రిక్తత :

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఓటు వేసేందుకు గద్వాల జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేయటానికి వచ్చిన ఆయన.. చాలాసేపు అక్కడే ఉండటంతో.. పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఓటు వేసేందుకు వేచి ఉంటే తప్పేంటి అంటూ సీఐ భీంకుమార్ తో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే. ఈ పరిణామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ALSO READ | కాంగ్రెస్ లో ఈ స్థానాలు..నెక్స్ట్ మీటింగ్ లోనే ఫైనల్.. హాట్ సీట్ గా ఖమ్మం