భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాచలం రాములవారి ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో ఎండోమెంట్ కమిషనర్, ఈవో, అర్చకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు భట్టీ విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క స్వామి వారిని దర్శించుకున్నారు.

అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా తొలిరోజు ప్రధాన ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకటి రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.కాగా, మరికొద్దిసేపట్లో  ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పేదలకు- ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షల సాయం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.