15న ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

15న ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఖమ్మం, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి, మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లోని పూసుగూడెం పంప్ హౌస్ దగ్గరకు చేరుకోనున్నారు. పంపు హౌస్ దగ్గర పైలాన్ ఆవిష్కరించిన తర్వాత, పంపు హౌస్ స్విచ్ ఆన్ చేయనున్నారు.

 అక్కడ సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్​లో వైరా చేరుకుంటారు. అక్కడ రూ.2 లక్షల లోపు రుణమాఫీ పూర్తి సందర్భంగా జరిగే బహిరంగ సభలో రైతులకు చెక్కులందించనున్నారు. బహిరంగ సభ పూర్తి అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు వైరా నుంచి బయలుదేరి హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.