ఎంపీ మల్లు రవికి సీఎం బర్త్ డే విషెస్

ఎంపీ మల్లు రవికి సీఎం బర్త్ డే విషెస్

హైదరాబాద్, వెలుగు: నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి బర్త్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని లేఖలో సీఎం పేర్కొన్నారు. తన బర్త్ డే సందర్భంగా మల్లు రవి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను అమీర్ పేటలోని పార్టీ కార్యాలయంలో కలిశారు.

  ఈ సందర్భంగా కేఏ పాల్ ప్రార్థనలు చేసి మల్లు రవిని ఆశీర్వదించారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ నటుడు సాయి ధరమ్​ తేజ్ ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో సమావేశమ య్యారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.