
మద్దూరు/ఉప్పునుంతల/పాలమూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతిస్తూ ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంబురాలు చేసుకున్నారు. మద్దూరులో బీసీ సంఘం నాయకులు కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పాత బస్టాండ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఉప్పునుంతలలోని మెయిన్ చౌరస్తాలో బీసీ సంఘాల నేతలు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మహబూబ్ నగర్ బస్టాండ్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు.