
- వరద నష్టంపై కలెక్టరేట్‌లో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ
కామారెడ్డి, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్ట్ 27 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంటలను సీఎం పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మొదట లింగంపేట మండలం మోతె శివారుకు చేరుకుంటారు. లింగంపల్లి ఖుర్థు శివారులో కొట్టుకుపోయిన బ్రిడ్జిని, బురుగిద్ద వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
అక్కడి నుంచి కామారెడ్డికి చేరుకొని జీఆర్ కాలనీలో వరద బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి.. వివిధ శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించనున్నారు.
లింగంపేట, కామారెడ్డిలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పరిశీలించారు. జీఆర్ కాలనీలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సైతం పర్యటించారు.