
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. ఆడబిడ్డలంటే తనకెంతో గౌరవమంటూ.... గత ప్రభుత్వంలో వారిని ఎవరూ పలకరించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్ తో మహిళలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 30కి పైగా మహిళలకు అసెంబ్లీ సీట్లు వస్తాయన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాలు రూపొందించామన్నారు. తెలంగాణలో స్కూళ్ల బాధ్యతతో పాటు వెయ్యి మెగావాట్ల పవర్ ప్లాంట్ల నిర్మాణం.. ఆర్టీసీబస్సులకు మహిళలనే ఓనర్లు చేశామన్నారు.