ఐదు గ్యారంటీ స్కీమ్​లకు.. రూ.52వేల కోట్లు

ఐదు గ్యారంటీ స్కీమ్​లకు.. రూ.52వేల కోట్లు

బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని, 5 గ్యారంటీ స్కీమ్​ల కోసం రూ.52వేల కోట్లు కేటాయిస్తున్నామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కర్నాటక ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా నిర్వరిస్తున్న సిద్ధరామయ్య.. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను శుక్రవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కీలక ప్రకటనలు చేశారు. ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్), బీర్లపై ఎక్సైజ్ సుంకం పెంచాలని ప్రతిపాదించారు.

1.30 కుటుంబాలకు గ్యారంటీ స్కీమ్స్

ఐదు గ్యారంటీ స్కీమ్స్​లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ, 10కేజీల ఫ్రీ రేషన్, మహిళకు ప్రతి నెలా రూ.2వేలు, నిరుద్యోగులకు రూ.3 వేలు అందిస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ స్కీమ్స్ కోసం మొత్తం రూ.52వేల కోట్లు కేటాయించామన్నారు. కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధంగా ఉందని సిద్ధరామయ్య విమర్శించారు. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న ఇండియా వంటి దేశానికి ఎన్ఈపీ సూట్ కాదని స్పష్టం చేశారు.

గిగ్ వర్కర్లకు రూ.4లక్షల బీమా

శివమొగ్గ, చిక్‌‌‌‌‌‌‌‌మగళూరు, హసన్, దక్షిణ కన్నడ, కొడగు, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో వ్యవసాయోత్పత్తులు ట్రాన్స్​పోర్ట్ చేయడానికి పికప్ వ్యాన్లు కొనేందుకు రూ.7లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందజేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. స్విగ్గీ, జొమాటో, అమెజాన్‌‌‌‌‌‌‌‌ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్‌‌‌‌‌‌‌‌ వర్కర్లకు ఇకపై రూ.4 లక్షల బీమా వర్తింపజేస్తామన్నారు. ఇందులో రూ.2 లక్షలు జీవిత బీమా కాగా.. మరో రూ.2 లక్షలు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. 2023 – 24 బడ్జెట్ అంచనాల ప్రకారం.. మొత్తం ఖర్చు రూ.3,27,747 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రెవెన్యూ ఖర్చు  రూ.2,50,933 కోట్లు.  మూలధన వ్యయం రూ.54,374 కోట్లు, లోన్ రీ పేమెంట్ రూ.22,441 కోట్లుగా నిర్ణయించారు. అత్యధికంగా విద్యా రంగానికి రూ.37,587 కోట్లు కేటాయించారు.