జులై నుంచి విశాఖలోనే : జగన్ 

జులై నుంచి విశాఖలోనే : జగన్ 

సీఎం వైఎస్  జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తానని  సీఎం జగన్ మంత్రులతో అన్నారు.  మంత్రుల పనితీరును తాను గమనిస్తున్నానని, ఏ మాత్రం తేడా వచ్చిన ఉద్వాసన తప్పదని మంత్రులను  హెచ్చరించారు. సక్రమంగా పనిచేయని మంత్రులకు వేటు తప్పదని  కేబినెట్‌ మీటింగ్ లో జగన్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో జరగనున్న  ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు గెలవాల్సిందేనని  మంత్రలకు జగన్ స్పష్టం చేశారు.  ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అసెంబ్లీలో ప్రజలకు వివరించాలని జగన్ మంత్రలకు సూచించారు. విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. తానూ విశాఖకు షిఫ్ట్‌ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు.