త్వరలో ఈ–కామర్స్​లోకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్

త్వరలో ఈ–కామర్స్​లోకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్
  • కస్టమర్లే మా కింగ్ 
  • అందుకే మాకు ఆదరణ 
  • విస్తరణకు రెడీ
  • త్వరలో ఈ–కామర్స్​లోకి
  • సీఎంఆర్​ ఫ్యామిలీ మాల్​ ఎండీ సత్యనారాయణ

హైదరాబాద్​, వెలుగు: కస్టమర్​కు చిన్న అసౌకర్యం కూడా కలగకుండా చూసుకోవడం, అన్ని విషయాల్లో వాళ్లకు సహకరించడం వల్లే తమ సంస్థ ఎదుగుతోందని సీఎంఆర్​ ఫ్యామిలీ​ మాల్​ ఎండీ సత్యనారాయణ అన్నారు. తమ స్టోర్లో షాపింగ్​చేసిన వాళ్లు పూర్తి సంతృప్తితో వెళ్లేలా తాము చూస్తామని చెప్పారు. మిడిల్​క్లాస్  జనమే తమ టార్గెట్​ కస్టమర్లని, వాళ్ల అవసరాలకు, అభిరుచులకు తగ్గ వస్త్రాలను, నగలను అందిస్తున్నామని అన్నారు. 

సంస్థ విస్తరణ సహా పలు అంశాల గురించి సత్యనారాయణ ‘వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అవన్నీ ఆయన మాటల్లోనే...1995లో ప్యాట్నీ సెంటర్​లో చందనా బ్రదర్స్​ను ప్రారంభించడం ద్వారా మా ప్రయాణం మొదలయింది. తెలంగాణలో ఇప్పుడు మాకు 17 మాల్స్​ ఉన్నాయి. వీటిలో టెక్స్​టైల్స్​తోపాటు నగలనూ అమ్ముతున్నాం. రెండు స్టోర్లను ప్రత్యేకంగా నగల అమ్మకాలకే కేటాయించాం. సంస్థను పెద్ద ఎత్తు విస్తరించబోతున్నాం. 

ఇటీవలే బాలాపూర్​, తుర్కయాంజల్​, వికారాబాద్​లో స్టోర్లు తెరిచాం. త్వరలో కూకట్​పల్లి, శంకర్​పల్లిలో మా స్టోర్లు ఏర్పాటవుతాయి. కర్ణాటక, మహారాష్ట్రలోని స్టోర్ల ఏర్పాటుపై ఆలోచిస్తున్నాం. కస్టమర్​షాపులో అడుగుపెట్టినప్పటి నుంచి, తిరిగి వెళ్లే వరకు మా  సిబ్బంది శ్రద్ధగా చూసుకుంటారు. కొన్న ప్రొడక్టులు నచ్చకుంటే ఎటువంటి ప్రశ్నలు అడగుకుండా వాపసు తీసుకుంటాం. క్వాలిటీ విషయంలో రాజీపడటం లేదు. మా సప్లయర్లు మాకు ఎప్పటికప్పుడు లేటెస్ట్​ డిజైన్లు ఇస్తారు. ఇవి వేరే షాపుల్లో  ఆర్నెళ్ల వరకు దొరకవు. 

టార్గెట్​..20 శాతం గ్రోత్​

గత ఆర్థిక సంవత్సరంలో మేం రూ.1,665 కోట్ల రెవెన్యూపై రూ.22 కోట్ల లాభం సంపాదించాం. 2024లో కొత్త స్టోర్ల నుంచి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి రెవెన్యూ గ్రోత్​ 20 శాతం ఉంటుందని అంచనా వేశాం. కొత్త స్టోర్ల విస్తరణకు అంతర్గత నిధులనే వాడుతున్నాం. ఐపీఓకు వెళ్లే ఆలోచన లేదు. ప్రస్తుతం మా దగ్గర 2,200 మంది పనిచేస్తున్నారు. చిన్న స్టోర్​కు రూ.3–4 కోట్లు, పెద్ద స్టోర్​కు రూ.7‌‌‌‌‌‌‌‌–10 కోట్లు ఖర్చవుతోంది. 

చదరపు మీటరుకు దాదాపు రూ. మూడువేలు ఖర్చు చేస్తున్నాం. రెండు మినహా మిగతా స్టోర్లన్నీ లీజు పద్ధతిలో నిర్వహిస్తున్నాం. తెలంగాణ టెక్స్​టైల్​సంస్థల్లో మేం టాప్​–5లో ఉన్నాం. త్వరలో మేం ఈ–కామర్స్​లోకి వస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్​సైట్​ను డెవెలప్​చేస్తున్నాం. ప్రస్తుతం ఇది టెస్టింగ్​స్టేజీలో ఉందని సత్యనారాయణ వివరించారు.